Watermark
Site Logo

తెలంగాణ విముక్తి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం – సాటా*

Posted by: admin   |   Published on: 03 June 2026, 12:07 AM
News Image
రియాద్, సౌదీ అరేబియా: తెలంగాణ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఘన నివాళులర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ చరిత్ర, విముక్తి పోరాటం, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సాటా వ్యవస్థాపకులు శ్రీ మల్లేశన్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం భారత చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ, తెలంగాణ విముక్తి పోరాటం మరియు అనంతరం జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు. దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు మరియు అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిజాం పాలన నుండి విముక్తి పొందగా, 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం తెలంగాణ చరిత్రలో రెండు కీలక మైలురాళ్లుగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాటా వివిధ ప్రాంతాల అధ్యక్షులు శర్వాణి విద్యాధరణి, తేజ పళ్లెం, పామిరెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. అలాగే కోర్ టీం సభ్యులు కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వర రావు వీరవల్లి, సింగ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీ చరణ్, మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పడాల తదితరులు తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులందరికీ శతకోటి వందనాలు తెలియజేశారు.

అమరవీరుల ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలని, తెలంగాణ అభివృద్ధి మరియు సమాజ పురోగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఈ సందర్భంగా సంకల్పం వ్యక్తం చేశారు.

జై తెలంగాణ!
అమరవీరుల త్యాగాలకు శత శత నమనాలు! 🌹🙏🇮🇳
🏠 Home