UGADI : సౌదీలో ఘనంగా ఉగాది వేడుకలు
రిపబ్లిక్ హిందుస్థాన్, సౌదీ అరేబియా : దేశంలో ఏదొక పేరుతో సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేస్తున్న రోజుల్లో ఎక్కడో బయట దేశానికి వెళ్లిన వారు తమ మాతృభూమికి దూరంగా ఎడారి దేశాలలో పని చేస్తున్న ప్రవాసాంధ్రులు వీలయినప్పుడల్లా విదేశీ గడ్డపై తమ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో తెలుగు పండుగలను అందరు కలిసి వైభవంగా జరుపుకుంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను సౌదీ అరేబియాలో క్యాపిటల్ పట్టణం రియాద్ లో తెలుగు ప్రవాసీయులు సాటా అధ్వర్యంలో ఇటీవల అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన పంచాగ శ్రవణం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరింపజేశాయి. అందరూ...