ఖతార్‌లో తెలుగు ప్రవాసికి ప్రతిష్ఠాత్మక 'సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)' పురస్కారం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నేషనల్ డెస్క్ : ఖతార్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక "సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024" వేడుకలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి వెంకప్ప భాగవతుల "సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)" అవార్డును గెలిచారు. ఖతార్‌లోని తెలుగు సమాజానికి మరియు భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, మరియు సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది. "సౌత్ ఐకాన్ అవార్డు" అనేది SIGTA కార్యక్రమంలో అందించబడే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించడంలో...