సౌదీ కు వచ్చిన సంక్రాంతి... సాటా ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు

సంక్రాంతి శోభ సౌదీని క‌న్నుల పండ‌వ‌గా అలంక‌రించింది. సౌదీ అరేబియాలోని తెలుగు వారందరికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా సౌదీ తెలుగు అసోసియేషన్ (సాటా) నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో విజయ, దివ్య, గౌరి, సూర్య లాంటి ప్రతిభావంతుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరినీ మైమరిపించాయి. మ్యూజిక్, లైటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా రాకేష్, రామ్, కృష్ణ, పర్దు అందించిన ప్రదర్శన కార్యక్రమానికి మరింత అందం చేకూర్చింది. అందమైన డెకరేషన్లతో ప్రాంగణాన్ని ముస్తాబు చేసిన సురేష్, రాధా, సతీష్, సుబ్బు, విశాల్, సోవ్య, జయశ్రీ వంటి వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. నోరూరించే వంటకాలు అందించిన తరక్, జగదీష్, రవి, రాంబాబు వారి...