దుబాయిలో భారత కాన్సులేట్ కు కన్సుల్ జనరల్ గా నియమితులైన తొలి తెలంగాణ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన GWAC కార్యవర్గం.
సౌదీ అరేబియా: నూతన కన్సుల్ జనరల్ గా దుబాయిలో పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ డా. ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన GWAC(Gulf Workers Awareness Center) కార్యవర్గం. కాన్సుల్ జనరల్ గారికి ఒక వినతిపత్రం అందించి దుబాయి మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లో తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, మరి ముఖ్యంగా తెలంగాణ నుండి వచ్చిన మరియు ప్రస్తుతం వస్తున్న బ్లూ కలర్ వర్కర్స్ కు కల్పించాల్సిన అవగాహన గురించి చర్చించాము. ప్రధానంగా గుల్పారం అలవాటు ఉండి దుబాయి వస్తున్న తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చాల వివరంగా కాన్సుల్ జనరల్ గారు తెలుసుకున్నారు,...