సాటా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రియాద్: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాటా అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశంతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి భావాలను భావితరాలకు అందించడమే సాటా లక్ష్యమని తెలిపారు. భారతదేశ అభివృద్ధి, శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ తో పాటు వివిధ ప్రాంతాల అధ్యక్షులు సర్వాని విద్యా ధరణి, తేజ...