మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఖతార్ ప్రవాస తెలుగు సమాజం
Saudi Arabia: ఒంగోలు వాసి, ఏ కె వి అధ్యక్షుడు మరియు ఎన్ ఆర్ ఐ టి డి పి ఖతార్ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గడ్డె శ్రీనివాస్ చొరవతో స్వర్గీయ సుంకై మల్లేశ్ కుటుంబానికి రూ.11 లక్షలకు పైగా ఆర్థిక సహాయం. దోహా, ఖతార్: కష్టకాలంలో ఉన్న ఒక తెలుగు కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వానికి నిజమైన అర్థాన్ని చాటిచెప్పింది ఖతార్ లోని ప్రవాస తెలుగు సమాజం. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్వర్గీయ సుంకై మల్లేశ్ ఇటీవల ఖతార్ లో మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ, మరోవైపు...