తెలంగాణ విముక్తి పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం – సాటా*
రియాద్, సౌదీ అరేబియా: తెలంగాణ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఘన నివాళులర్పించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ చరిత్ర, విముక్తి పోరాటం, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సాటా వ్యవస్థాపకులు శ్రీ మల్లేశన్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం భారత చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తి కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ...