దేశంలో ఘనంగా తీజ్ పండుగ....
తొమ్మిది రోజులపాటు జరిగే తీజ్ వేడుకల పై ప్రత్యేక కథనం..... రిపబ్లిక్ హిందూస్థాన్ , ఎడిటోరియల్ న్యూస్: తీజ్ పండుగ అంటేనే బంజారాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుంది. ఈ పండుగ ప్రారంభించడానికి ముందు బంజారాల గ్రామాల్లో , తండాల్లో ఆడపిల్లలంతా కలిసి ఇంటింటికీ తిరిగి గ్రామంలో ని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు . ఉత్సవాలు నిర్వహించడానికి ఊరి పెద్ద నాయక్ , కార్బారిలా చర్చించి పండుగను ప్రారంభిస్తారు . శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు పండుగ ప్రారంభం అవుతుంది . మొత్తం తొమ్మిది రోజులపాటు పండుగ వేడుకలు జరుపుకుంటారు . ముందుగా ఉత్సవాలకు కావాల్సిన గోధుమలు , శనగలు , ఇతర సామాగ్రి సమకూరుస్తారు...