గంజాయి సాగు , వినియోగం పై ఉక్కుపాదం మోపండి ....
ఉగ్రవాదులను అరికట్టగలిగాం కానీ మాదకద్రవ్యాలు పై నియంత్రణ లేదన్న సీఎం కేసీఆర్ .... పలు అంశాల పై సుదీర్ఘ సమావేశంలో లో చర్చించినా సీఎం రిపబ్లిక్ హిందుస్థాన్, ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె. చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ రోజు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి మాట్లాడారు. గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నదని రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా...