<em>మరిన్ని బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ </em>ఆదేశం
ప్రగతి భవన్ : కరోన కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హై అలర్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును, వైద్యాధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం ఈ రోజు ప్రగతి...