బాధితులను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలి
-- బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజెందర్ రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ : మండలంలోని వాంకిడి, పాషా తండా గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని ఇండ్ల పైకప్పులు కూలిపోవడంతో బాధితులకు నివాసాలు లేక రోడ్డునపడ్డారు. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజెందర్ ఆయా గ్రామాలకు చేరుకుని కూలిన ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు మరియు పైకప్పు తాత్కాలికంగా కప్పు కోవడానికి పారీలు ( టార్పాలిన్లు) బాధితులకు అందచేశారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మీడియాతో మాట్లాడారు. బోథ్ నియోజకవర్గంలో...