EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

    Author REPUBLIC HINDUSTHAN | 14 Aug 2024, 08:56 AM |
    తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ


    హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

    బీఆర్‌ఎస్‌ సభ్యుడు కె.కేశవరావు రాజీనామాతో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ నెల 21 వరకు నామినే షన్లను స్వీకరించనున్నారు.

    ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

    అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.