EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విధుల గుండా కుక్కల స్వైర విహారం....  దడ పుట్టిస్తోన్న కుక్కల గుంపు...

    Author REPUBLIC HINDUSTHAN | 20 Sep 2024, 12:00 PM |
    విధుల గుండా కుక్కల స్వైర విహారం....  దడ పుట్టిస్తోన్న కుక్కల గుంపు...


    *ఏ గల్లీలో చూసిన డజన్ల కొద్ది తిరుగుతున్న కుక్కలు

    *భయం గుప్పెట్లో నందిగామ గ్రామ ప్రజలు

    *స్కూల్ విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం

    *వీధి కుక్కలను బంధించి..ప్రజలకు రక్షణ కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డ రాజు, విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య డిమాండ్.

    రిపబ్లిక్ హిందుస్థాన్,  నల్లబెల్లి:

    వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామము లో వీధి కుక్కలు ఏ గల్లీలో చూసిన డజన్లకొద్దీ కలియ తిరుగుతూ, స్వైరవిహారం చేస్తున్నాయని, బాటసారులను, బైకర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అదేవిధంగా ఒంటరిగా కనిపించిన వ్యక్తులను, స్కూల్ పిల్లలను తరుముతూ..ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పలుమార్లు ముకుమ్మడిగా దాడులు చేస్తూ..భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్కూల్ కు వెళ్లే విద్యార్థులు వీటిని చూసి స్కూల్ కు వెళ్లడానికి జంతుతున్నారు.



    కుక్కల నుండి రక్షణ కల్పించాలని ఎంపిడిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

    ఇవి కూడా చదవండి


    వీధి కుక్కలు రాష్ట్రంలో అనేకచోట్ల పసిపిల్లలను పొట్టనపెట్టుకున్న సంఘటనలను గుర్తు చేసుకుంటే పసిపిల్లల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వీధి కుక్కలు ఎప్పుడు ఎవరిని కబలిస్తాయోనని పసిపిల్లల తల్లిదండ్రులు,  గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ వీధి కుక్కలను ఇలాగే వదిలేస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని ఎవరికి ఏ హాని జరగకముందే వీటిని బంధించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ నల్లబెల్లి ఎంపీడీవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.