EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సొంతగూటికి చేరిన ఉద్యమ కారుడు భాస్కర్ రెడ్డి, మాజీసర్పంచ్ రాఘన్ రెడ్డి  కండువా కప్పీ  ఆహ్వానించిన బోథ్ అనిల్ జాదవ్ ఎమ్మెల్యే

    Author REPUBLIC HINDUSTHAN | 09 Oct 2025, 03:55 PM |
    సొంతగూటికి చేరిన ఉద్యమ కారుడు భాస్కర్ రెడ్డి, మాజీసర్పంచ్ రాఘన్ రెడ్డి  కండువా కప్పీ  ఆహ్వానించిన బోథ్ అనిల్ జాదవ్ ఎమ్మెల్యే





    రిపబ్లిక్ హిందూస్తాన్,బజార్ హత్నూర్ :  మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు భాస్కర్ రెడ్డి  మరియు పిప్రి మాజీ సర్పంచ్ రగన్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నుంచి సొంతగూటికి బి ఆర్ ఎస్ లో ఎమ్మెల్లే అనిల జాదవ్ సమక్షంలో గురువారం చేరారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బి ఆర్ ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉద్యమ కారుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కల్తీ కాంగ్రెస్ లో కలవలేమని ప్రతిపక్షంలో ఉన్నా సొంత గూడు, ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే సుఖంగా ఉంటుందని తిరిగి ఎమ్మెల్యే అనిల్ జాదవ్  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్  మాట్లాడుతూ.. ఉద్యమంతో తెలంగాణనే సాధించిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలోనే క్షేమంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.