EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వచ్చి.. చివరకు విగతజీవిగా స్వగ్రామానికి చేరిన గడ్డం మోహన్*

    Author REPUBLIC HINDUSTHAN | 04 Sep 2026, 08:39 PM | Crime, HEALTH, INTERNATIONAL, NATIONAL, saudi arabia
    బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వచ్చి.. చివరకు విగతజీవిగా స్వగ్రామానికి చేరిన గడ్డం మోహన్*

    రియాద్: బతుకుదెరువు కోసం, కుటుంబాన్ని పోషించాలనే ఆశతో సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాకు వచ్చిన గడ్డం మోహన్ గారు అనేక కష్టాలను ఎదుర్కొని, చివరకు విగతజీవిగా స్వగ్రామానికి తిరిగి వెళ్లడం పలువురిని కన్నీటి పర్యంతం చేసింది.

    రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి గ్రామానికి చెందిన *గడ్డం మోహన్ గారు* ఎప్పటిలాగే రోజువారీ పనికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనతోటి కార్మికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రెయిన్ సర్జరీ అవసరమని నిర్ధారించి శస్త్రచికిత్స చేశారు.

    అయితే, మోహన్ గారి కుటుంబం తీవ్ర పేదరికంలో ఉండటంతో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహాయం కోసం *SATA రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ గారిని* సంప్రదించారు. అప్పటి నుంచి శ్రీనివాస్ మచ్చ గారు తన టీమ్ సభ్యులు *ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, సింగు నరేష్ కుమార్, ముదిగొండ శంకర్, నూరుద్దీన్, లోకేష్* తదితర SATA సభ్యులతో కలిసి మోహన్ గారి కుటుంబానికి అండగా నిలిచారు. వైద్య చికిత్సకు సంబంధించిన విషయాల్లోనూ, కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాల్లోనూ తమ వంతు తోడ్పాటును అందిస్తూ వచ్చారు.

    అయితే అనుకోని పరిస్థితుల్లో గడ్డం మోహన్ గారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో, *23 ఆగస్టు 2026న ఆయన మృతి చెందారు.*

    మోహన్ గారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్న శ్రీనివాస్ మచ్చ గారు మరియు ఆయన టీమ్ సభ్యులు ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచి, అవసరమైన అన్ని ప్రక్రియలను సమన్వయం చేసి, *గడ్డం మోహన్ గారి భౌతికకాయాన్ని ఈరోజు ఆయన స్వగ్రామానికి పంపించారు.*

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా శ్రీనివాస్ మచ్చ గారు మాట్లాడుతూ, ఈ మొత్తం ప్రక్రియలో ఎంతో సహకారం, సమన్వయం మరియు సహాయ సహకారాలు అందించిన *భారత రాయబార కార్యాలయం డెత్ డిపార్ట్ మెంట్*తో పాటు, కార్యాలయంలోని ప్రతి ఒక్క అధికారి మరియు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

    కష్టకాలంలో సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం అందించిన సహాయ సహకారాలు బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వచ్చిన నిరుపేద భారతీయులకు ఎంతో భరోసాను కల్పిస్తున్నాయని పలువురు అభినందించారు.

    అదేవిధంగా, శ్రీనివాస్ మచ్చ గారు *తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని*, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ నుంచి గడ్డం మోహన్ గారి స్వగ్రామం వరకు *ఉచిత అంబులెన్స్ సదుపాయాన్ని* ఏర్పాటు చేశారు.

    చివరిగా శ్రీనివాస్ మచ్చ గారు ఈ క్లిష్ట సమయంలో తమ విలువైన సహాయ సహకారాలు అందించిన భారత రాయబార కార్యాలయ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం, SATA సభ్యులు మరియు ఇతర సహాయకులకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

    *“సౌదీ అరేబియాలో ఏ ఒక్క తెలుగు వ్యక్తి అయినా, ఏ భారతీయుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా SATAను సంప్రదించవచ్చు. అవసరమైన సమయంలో వారికి అండగా నిలవడానికి SATA ఎల్లప్పుడూ ముందుంటుంది”* అని శ్రీనివాస్ మచ్చ గారు తెలిపారు.