EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సాటా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author REPUBLIC HINDUSTHAN | 16 Aug 2026, 05:35 PM | INTERNATIONAL, NATIONAL, saudi arabia, TELUGU NRI
    సాటా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    రియాద్: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

    ఈ సందర్భంగా సాటా అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశంతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, దేశభక్తి భావాలను భావితరాలకు అందించడమే సాటా లక్ష్యమని తెలిపారు. భారతదేశ అభివృద్ధి, శాంతి, సౌభ్రాతృత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

    ఈ సందర్బంగా సాటా వ్యవస్థాపకులు మల్లేశన్ తో పాటు వివిధ ప్రాంతాల అధ్యక్షులు సర్వాని విద్యా ధరణి, తేజ పళ్లెం, పామిరెడ్డీ రామిరెడ్డి, మరియు కోర్ టీమ్ సభ్యులు శంకర్ ముదిగొండ, నరేష్ కుమార్ సింగు, అహ్మద్ అబ్దుల్ కరీం, అర్షియా బేగం, కోకిల ఒత్తులూరి, శ్రీచరణ్, లోకేష్ తాళ్ల, మిధున సురేష్, ఖాజా ముజమిలొద్దీన్, మహమ్మద్ నూరద్దీన్, అర్జున్ కృష్ణ, దానిష్ కమల్ ఖాన్, ఇర్షాద్ హుస్సేన్, మహమ్మద్ షుజాద్ ఖాన్, అమీర్ ఆలమ్, మహమ్మద్ ఇస్రార్ అహ్మద్ మక్సూద్, అహ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ ముస్తఫా, షేక్ అస్లాం పాషా, అఫ్రోజ్ ఆలమ్, షోహెబ్ ఉల్లా, వసీమ్, శేఖర్ పడాల, యోగేశ్వర్ రావ్, రోజధర్ సయ్యిద్ (అస్లాం) మరియు సాటా కుటుంబ సభ్యులు భారతీయిలకు స్వాతంత్ర్య దినోత్సవశుభాకాంక్షలు తెలియజేశారు.

    ఇవి కూడా చదవండి